: ఉగ్రవాదులకు నివాళిగా మసీదుల నుంచి గీతాలు!
ప్యాంపోర్ లోని ఓ ప్రభుత్వ కార్యాలయ భవంతిలో దాగున్న ఉగ్రవాదులను హతమార్చేందుకు మూడు రోజుల పాటు సైన్యం తీవ్రంగా శ్రమిస్తే, వారికి నివాళులు అర్పిస్తూ, వారి త్యాగం అసమానమని కీర్తిస్తూ, మసీదుల నుంచి జాతి వ్యతిరేక గీతాలు వినిపించడాన్ని అధికారులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న ఫ్రెస్తాబల్, ద్రాంగ్ బల్, కడ్లాబల్, సెంపోరా ప్రాంతంలోని మసీదుల నుంచి సోమవారం నాడు 'జాగో జాగో సుబా హుయి', 'జీవే జీవే పాకిస్థానీ', 'హమ్ క్యా చాహతే - ఆజాదీ' వంటి పాటలు, నినాదాలు వినిపించాయని తెలుస్తోంది. దీంతో ఈ మసీదుల కార్యకలాపాలపై నిఘా పెంచాలని సెక్యూరిటీ వర్గాలు, ఇంటెలిజెన్స్ ఏజన్సీలు నిర్ణయించినట్టు సమాచారం.