: కాంగ్రెస్ ఫార్ములా... ముందు జేఎన్యూ, తరువాతే మరేదైనా!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవాలని వ్యూహరచన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, కీలక బిల్లులకు అడ్డుతగలాలని భావిస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ వర్శిటీలో జరిగిన ఘటనలను, అంతకుముందు హైదరాబాద్ లో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య, హర్యానాలో జాట్ల హింసాకాండ, పఠాన్ కోట్ ఉగ్రదాడి తదితర అంశాలపై చర్చకు డిమాండ్ చేయాలన్నది ఆ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. ఈ సమావేశాల్లో జీఎస్టీ, నిర్మాణ రంగ సంస్కరణ బిల్లులను ఎలాగైనా అమలు చేయించుకోవాలని అధికార ఎన్డీయే భావిస్తున్నప్పటికీ, అదంత సులభం కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, మరికాసేపట్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.