: ఉల్లి లొల్లి!... కిలో రూ.3కు పడిపోయిన ధర, మలక్ పేటలో రైతుల ఆందోళన
తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు రాజకీయ వేడి సెగలు కక్కుతుంటే, మరోవైపు ఉల్లి లొల్లి షురూ అయ్యింది. నిన్నటిదాకా పరిస్థితి బాగానే ఉన్నా, నేటి ఉదయం రైతులు పండించిన ఉల్లి సేకరణ ధరను వ్యాపారులు అమాంతంగా తగ్గించేశారు. ప్రస్తుతం రైతుల నుంచి కిలో ఉల్లికి రూ.3లకు మించి వ్యాపారులు చెల్లించడం లేదు. దీంతో కంగుతిన్న రైతులు హైదరాబాదులోని మలక్ పేట మార్కెట్లో ఆందోళనకు దిగారు. చిల్లర అమ్మకాలకు స్వస్తి చెప్పి, హోల్ సేల్ మార్కెట్ వైపు మొగ్గు చూపితే కనీసం రవాణా చార్జీలు కూడా రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఉల్లి దిగుబడి పెరిగిన నేపథ్యంలో ధరలు తగ్గించక ఏం చేస్తామంటూ వ్యాపారులు వాదిస్తున్నారు.