: బైక్ 'కీ' లాక్కునే అధికారం ఏ అధికారికీ లేదట!
బైక్ కీ లాక్కునే అధికారం పోలీసు కానిస్టేబుల్ కే కాదు, ఏ ఇతర పోలీసు అధికారికి లేదు. ఈ విషయాన్ని రవాణా శాఖ పేర్కొంది. హర్యానాలోని సిర్ఫా ప్రాంతానికి చెందిన పవన్ పారిఖ్ అనే లాయర్ తన బైక్ పై వెళుతున్న సందర్భంలో ఈ తరహా సంఘటన ఆయనకు ఎదురైంది. దీంతో, ఈ విషయమై ఆర్ టీఐని ప్రశ్నించాడు. దీనిపై రాష్ట్ర హోం శాఖ స్పందించింది. బైక్ కీ లాక్కునే అధికారం ఏ పోలీస్ అధికారికి లేదని, ఈ విషయం వారికి తెలియకపోవడం వల్లే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. ఈ సందర్భంగా మరో మూడు విషయాలను కూడా ప్రస్తావించారు. ఏ పోలీసు అధికారికి ఫైన్ ను బైహ్యాండ్ గా చెల్లించాల్సిన అవసరం లేదని, లైసెన్స్ దగ్గర లేని పక్షంలో దాని నంబరు చెబితే చాలని, ఎస్సై పై స్థాయి వ్యక్తులు తప్ప ఇతర అధికారులు చలానా రాసేందుకు అర్హులు కారని రాష్ట్ర హోం శాఖ పేర్కొంది.