: పోంపోర్ ఉగ్రదాడి నష్టం 220 కోట్లు?


జమ్మాకాశ్మీర్ లోని పోంపోర్ లో ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ ఎంటర్ ప్రెన్యూర్స్ డెవలెప్ మెంట్ ఇన్స్ స్టిట్యూట్ (జేకేఈడీఐ)లోని నాలుగవ అంతస్తులో మకాంవేసిన సంగతి తెలిసిందే. జమ్మూకాశ్మీర్ ప్రధాన రహదారి పక్కనే మూడు ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ భవనం నిర్మించారు. దీని ద్వారా 2004 నుంచి ఇప్పటి వరకు 13 వేల మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు శిక్షణ ఇచ్చారు. వీరితోపాటు మరో ఐదు వేల మందికి సుమారు 220 కోట్ల రూపాయలు రుణాలుగా ఇచ్చారు. ఈ మొత్తం వివరాలు ఈ భవనంలోని నాలుగో అంతస్తులో ఉన్న డేటాబేస్ కేంద్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. జాతీయ రహదారిపై సీఆర్పీఎఫ్ వ్యాన్ పై దాడి చేసిన తీవ్రవాదులు నేరుగా ఈ భవనంలో ప్రవేశించి, నాలుగో అంతస్తులో మకాం పెట్టారు. 48 గంటలపాటు భద్రతా బలగాల కాల్పులకు ఎదురొడ్డిన తీవ్రవాదులు ఈ డేటా బేస్ ను నాశనం చేసేశారని సమాచారం. దీంతో డేటాబేస్ బ్యాకప్ లేకపోవడంతో ఈ దాడి వల్ల 220 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. కాగా, దీనిపై గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించామని భద్రతా బలగాలు, పోలీసు బలగాలు చెబుతున్నాయి. అయినా రాష్ట్రప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని, ప్రైవేటు సెక్యూరిటీతోనే రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారని వారు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News