: షాడో టిక్కెట్ల కోసం థియేటర్లపై దాడి


అభిమాన హీరో కొత్త చిత్రం తొలి షోను చూడడానికే అభిమానులు ఇష్టపడతారు. అలాంటప్పుడు టిక్కెట్లు దొరక్కపోతే వారి ఆగ్రహం కట్టలు తెంచుకోక ఏమవుతుంది? తిరుపతిలో ఈ రోజు ఉదయం ఇలానే జరిగింది. విక్టరీ వెంకటేష్ నటించిన షాడో చిత్రం ఈ రోజు విడుదల అవనుంది. టిక్కెట్ల కోసం అభిమానులు రాత్రి నుంచే జగత్, విఖ్యాత్ థియేటర్ల కౌంటర్ల దగ్గర పడిగాపులు కాశారు. తీరా టిక్కెట్లు తమ దాకా రాకపోవడం, అక్కడే బ్లాక్ లో విక్రయిస్తుండడంతో అభిమానులకు కోపం నషాళానికి అంటుకుంది. దాంతో థియేటర్ల అద్దాలను ధ్వంసం చేసి, బ్యానర్లు చించేశారు.

  • Loading...

More Telugu News