: రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి మధ్య సయోధ్య కు బాబు యత్నాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాయలసీమలోని జమ్మలమడుగు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, స్థానిక టీడీపీ నేత రామసుబ్బారెడ్డి నేడు హాట్ టాపిక్ గా మారారు. గత కొంత కాలంగా ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతుండడంతో అతని రాజకీయ ప్రత్యర్థి, స్థానిక టీడీపీ నేత రామసుబ్బారెడ్డి అతని రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన పార్టీలో చేరితే తనదారి తాను చూసుకుంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి అభిప్రాయం తెలుసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి ఇద్దరి మధ్య విభేదాలు రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అయినప్పటికీ రామసుబ్బారెడ్డి తన అభిప్రాయం కుండబద్దలు కొట్టారు. దీంతో రామసుబ్బారెడ్డి ప్రాభవానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మధ్యవర్తిని నియమించి సమస్యలు పరిష్కరించే దిశగా ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.