: మేం జగన్ వెంటే ఉంటాము: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
తాము వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తోనే ఉంటామని... ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొన్ని ఛానళ్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు సర్కార్ తప్పుడు ప్రచారాలను మానుకోవాలని రాజన్న దొర అన్నారు.