: జగన్ రాష్ట్రాన్ని పాడు చేయాలని చూస్తున్నారు!: మంత్రి అచ్చెన్నాయుడు
రాష్ట్రాన్ని పాడు చేసేందుకు ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాయలసీమ నుంచే టీడీపీలో చేరికలు మొదలయ్యాయని, భవిష్యత్తులో తమ పార్టీలో చేరేవారి సంఖ్య భారీగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తున్నారు కనుకనే తమ పార్టీలో చేరేందుకు వారందరూ వస్తున్నారని అన్నారు. కొత్త వాళ్లు పార్టీలోకి రావడం వలన పార్టీలో ఉన్న పాతవాళ్లకు నష్టమేమి లేదని అన్నారు. మళ్లీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే నాటికి సుమారు యాభై శాతం మంది వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన వారు తమ పార్టీలో ఉంటారని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు.