: గాయపడ్డ ధోనీ... పార్థివ్ పటేల్ కు బీసీసీఐ పిలుపు
ఆసియాకప్ ప్రారంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ముంబై నుంచి ఢాకా చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించింది. ఈ ప్రాక్టీస్ సెషన్ లో కెప్టెన్ ధోనీ గాయపడ్డాడు. కండరాలు పట్టేయడంతో విశ్రాంతి అవసరమని భావించిన ధోనీ బీసీసీఐకి విషయం వివరించాడు. దీంతో ఢాకాలో ఉన్న జట్టుతో కలవాలని బీసీసీఐ పార్థివ్ పటేల్ కు పిలుపునిచ్చింది. దీంతో నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత పార్థివ్ టీమిండియాలో చోటుదక్కించుకున్నాడు. టీమిండియా తరపున 20 టెస్టులు, 38 వన్డేలు ఆడిన పార్థివ్ కేవలం రెండు టీట్వంటీల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు.