: సీఎం గారి నిర్ణయమే మా నిర్ణయం: శిల్పా బ్రదర్స్
తెలుగుదేశం పార్టీలోకి భూమా నాగిరెడ్డి చేరిక విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయమే తమ నిర్ణయమని టీడీపీ నేతలు శిల్పా బ్రదర్స్ అన్నారు. ఈరోజు వారు మీడియాతో మాట్లాడుతూ, తమ అభిప్రాయాలను, కార్యకర్తల మనోభావాలను సీఎంకు తెలియజేసినట్లు చెప్పారు. అయితే, టీడీపీ కార్యకర్తలు సర్దుకుపోవడం కష్టమేనని చెప్పారు. ‘మేము అందరిని కలుపుకుపోతాము. సీఎం గారికి చెప్పాల్సిన వన్నీ చెప్పాం. టీడీపీలోకి భూమా కుటుంబాన్ని తీసుకోవాలన్న దానిపై అన్ని విషయాలను సీఎం గారికి వివరించాం. మేము ఏ పార్టీలో ఉన్నప్పటికీ నాయకులకు విధేయులుగా ఉంటాము. మా నాయకుడి మాటే మాకు వేదవాక్కు. ఆయన్ని విభేదించే పరిస్థితి ఎప్పుడూ రాదు’ అని శిల్పా బ్రదర్స్ పేర్కొన్నారు.