: ఈ ఫొటోను రిజెక్టు చేయడంలో ఆశ్చర్యమేముంది?: అమితాబ్
'నీది సినిమాలకు పనికొచ్చే ముఖం కాదు' అనిపించుకున్న వ్యక్తే, కాలక్రమంలో ప్రేక్షకుల నీరాజనాలు అందుకుని, తనదైన నటనా కౌశలాన్ని ప్రదర్శించి బాలీవుడ్ మెగాస్టార్ గా రాణిస్తున్న వ్యక్తి అమితాబ్ బచ్చన్. సినిమాల్లో నటించడం కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో ఒక కాంటెస్టుకు ఆయన ఒక ఫొటో పంపారు. కాంటెస్టు నిర్వాహకులకు ఈ ఫొటో నచ్చకపోవడంతో పక్కనపడేశారు. నాడు తిరస్కారానికి గురైన ఆ ఫొటోను అమితాబ్ ఇప్పుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఒక ట్వీట్ కూడా చేశారు. ‘సినిమా అవకాశాల కోసం ఫిల్మ్ ఫేర్ మాధురి కాంటెస్ట్ కు నాడు నేను పంపిన ఫొటో ఇది. ఈ ఫొటోను వారు రిజక్ట్ చేయడంలో ఆశ్చర్యమేముంది!’ అని బిగ్ బీ ట్వీట్ చేశారు.