: టీడీపీ గూటికి విజయనగరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు?


విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కోస్తాంధ్రలో టీడీపీ సత్తాచాటగా, విజయనగరం జిల్లాలోని ఒడిశా సరిహద్దు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి సత్తాచాటింది. అయితే బొత్స ఆ పార్టీలో చేరిన నాటి నుంచి పరిస్థితులు పూర్తిగా మారాయి. విజయనగరం జిల్లాలో వైఎస్సార్సీపీకి పెద్ద దిక్కుగా భావించిన బొబ్బిలి రాజుల ప్రాభవానికి గండిపడింది. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో బొబ్బిలి రాజులు చురుగ్గా పాలుపంచుకోలేదు. తాజాగా టీడీపీ గేట్లు ఎత్తేయడంతో విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ నుంచి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజన్న దొర, కురుపాం నియోజకవర్గం నుంచి పుష్ప శ్రీవాణి ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఇప్పటికే అనధికార టీడీపీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News