: పద్మావతి వర్శిటీ పాలక మండలిలో రామోజీరావు కోడలు
తిరుపతిలోని ప్రతిష్ఠాత్మక పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలిగా రామోజీరావు కోడలు, కిరణ్ సతీమణి శైలజా కిరణ్ ను నియమిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. శైలజతో పాటు అపోలో గ్రూప్ సంస్థల చైర్మన్ ప్రతాప్ రెడ్డి కుమార్తె సంగీతా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లలితకుమారిలతో పాటు డి భారతి, ఎంవీ రమణమ్మ, పి.సుమతి లను నియమిస్తూ జీవోను విడుదల చేసింది. పద్మావతి వర్శిటీతో పాటు రాష్ట్రంలోని 11 యూనివర్శిటీలకూ పాలక మండళ్లను నియమిస్తున్నట్టు పేర్కొంది.