: భలే భలే ...'జీన్స్' స్టయిల్ గా నిలబడ్డాయి!
ఎలాంటి ఆధారం లేకుండా జపాన్ లోని హొక్కైడో గ్రామ వాసులు 295 జీన్స్ ను నిలబెట్టారు. ఇదెలా సాధ్యం? అనే అనుమానం వచ్చిందా? అయితే, ఇది చదవాల్సిందే. అమెరికాలోని మిన్నెసోటాలో ఇలా జీన్స్ ను నిలబెట్టే సంప్రదాయం మొదలైంది. ఇది మెల్లగా ప్రపంచ దేశాలకు పాకుతోంది. పలు రంగులు, సైజులు కలిగిన జీన్స్ ను ఏ ఆధారం లేకుండా నిటారుగా నిలబెట్టడానికి ముందు వాటిని మంచులో ముంచుతారు. దీంతో ఇది బిగుతుగా తయారవుతుంది. ఇలా తయారైన 295 ఫ్రోజెన్ జీన్స్ ను 5.3 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద హొక్కైడో గ్రామవాసులు నిలబెట్టారు. ఈ కార్యక్రమంలో 120 మంది పాల్గొన్నారు. కాగా, జపాన్ లోని పలు ప్రాంతాల్లో జనవరి చివరి నుంచి మార్చి చివరి వరకు మంచు కురుస్తుంది.