: ముగిసిన మూడు రోజుల ముష్కర పోరు, ముగ్గురు ఉగ్రవాదుల హతం
దాదాపు మూడు రోజులుగా కాశ్మీర్ లోని పాంపోర్ ప్రాంతంలో జరుగుతున్న ఎన్ కౌంటర్ ముగిసింది. ఓ ప్రభుత్వ కార్యాలయంలో దాగుండి కాల్పులకు తెగబడిన ముగ్గురు ఉగ్రవాదులనూ హతమార్చినట్టు సైనికాధికారులు తెలిపారు. ఎదురుకాల్పులు ముగిసాయని, నిన్న ఓ ఉగ్రవాదిని, నేడు మరో ఇద్దరినీ హతమార్చినట్టు అధికారులు ప్రకటించారు. ఘటనా స్థలిలో సోదాలు జరుగుతున్నాయని, ఉగ్రవాదులు ఏవైనా పేలుడు పదార్థాలు అమర్చారా? మరెవరైనా దాగున్నారా? అన్న కోణంలో సోదాలు చేస్తున్నామని వివరించారు. కాగా, ఈ కాల్పుల నేపథ్యంలో భవంతిలోని ఒక అంతస్తు పూర్తిగా దహనమైందని తెలిపారు.