: టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు


టీఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఖమ్మం సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నం వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ లో చేరారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయనకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, నిజాయతీపరుడైన పొన్నం వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ లో చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యక్తులు చేరడం వల్ల పార్టీకి ఎంతో బలమని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News