: కుమార్తెను వేధించిన వ్యక్తిని 22 రోజుల 'వేట' అనంతరం పట్టుకున్న తల్లి!


ముంబైలోని మెట్రో సినిమా సబ్ వే స్టేషన్... 22 ఏళ్ల నిరుద్యోగి నడిచి వస్తున్నాడు. అతని వెనుకే వచ్చిన 53 సంవత్సరాల మహిళ, అతనిని ఒక్కసారిగా పట్టుకుని కేకలు పెడుతూ, మిగతావారిని అలర్ట్ చేసింది. అంతా కలసి అతనిని పోలీసులకు అప్పగించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చెప్పిన మరిన్ని వివరాల ప్రకారం, 22 రోజుల క్రితం మహిళ కుమార్తెను ఆ వ్యక్తి వేధించాడు. సౌత్ ముంబై కాలేజీలో చదువుతున్న యువతిని జనవరి 30న మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో అదే సబ్ వేలో వేధించాడు. జరిగిన విషయాన్ని ఆమె తన తల్లికి వివరించి, యువకుడి రూపురేఖలను వర్ణించింది. అప్పటి నుంచి ఆమె అదే ప్రాంతంలో మధ్యాహ్న సమయంలో కూతురు చెప్పిన పోలికలున్న వ్యక్తి కోసం కాపుకాసింది. 22 రోజుల నిరీక్షణ అనంతరం అతను తిరిగి అదే స్టేషనుకు రాగా, అతన్ని పట్టిచ్చింది. కూతురు నిందితుడిని గుర్తుపట్టగా కేసు నమోదు చేసిన ఆజాద్ మైదాన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News