: బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ యుద్ధం చేస్తే... కోటిన్నర మంది చూసిన వీడియో ఇది
బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్... సమకాలీన ప్రపంచానికి తెలిసిన సూపర్ హీరోలు. కామిక్ క్యారెక్టర్లుగా ప్రవేశించి, సినీ పరిశ్రమ పుణ్యమాని ప్రతి ఒక్కరి మదినీ దోచిన వ్యక్తులు. ఇక ఈ ఇద్దరు సూపర్ హీరోలూ తలపడితే, ఈ కథాంశంతో హాలీవుడ్ నిర్మాత జాక్ స్నైడర్ రూపొందిస్తున్న చిత్రమే 'బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్'. ఈ చిత్రం అధికారిక ట్రైలర్ ఇప్పుడు దూసుకెళుతోంది. పది రోజుల వ్యవధిలో దీన్ని కోటిన్నర మందికి పైగా వీక్షించారంటే, ఈ చిత్రంపై ఉన్న ఆసక్తి ఎలాంటిదో తెలుసుకోవచ్చు. బెన్ అఫ్ లెక్, హెన్రీ కావిల్, అమీ ఆడమ్స్, జెస్సీ ఈసెన్ బర్గ్, హోలీ హంటర్ తదితరులు నటించిన ఈ చిత్రం వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ట్రైలర్ ను మీరూ చూడవచ్చు.