: అమ్మాయిల సెల్ ఫోన్లపై నిషేధం... మీరితే రూ. 2,100 జరిమానా!
సెల్ ఫోన్లు వాడుతున్న అమ్మాయిలు తేలికగా ప్రేమలో పడుతూ, తమ తల్లిదండ్రులకు సమస్యగా మారుతున్నారని ఆరోపిస్తూ, గుజరాత్ రాష్ట్రంలోని మెహసనా జిల్లా సూరజ్ గ్రామంలో మైనర్ బాలికలు మొబైల్ ఫోన్లు వాడటంపై నిషేధాన్ని విధించారు. అమ్మాయిల చేతుల్లో సెల్ ఫోన్లపై చర్చించేందుకు సమావేశమైన గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 18 సంవత్సరాల లోపు అమ్మాయిలు ఫోన్లను వాడరాదని, ఎవరైనా చేతిలో ఫోన్ తో కనిపిస్తే రూ. 2,100 జరిమానా చెల్లించాలని కూడా పంచాయితీ ఆదేశించింది. పెద్దల నిర్ణయానికి పటేల్, ఠాగూర్, రబారీ వర్గాల ప్రజలతో పాటు బడుగుల నుంచి కూడా ఆమోదం లభించిందని సమాచారం.