: ఢిల్లీలో జగన్, ఇంకా ఖరారు కాని ప్రణబ్, మోదీ అపాయింట్ మెంట్లు!


కేంద్ర వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్ లో కేటాయింపులను పెంచాలని నేతలను కోరేందుకు ఢిల్లీకి చేరుకున్న వైకాపా అధినేత వైఎస్ జగన్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ల నుంచి పిలుపుకోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డిలతో పాటు ఢిల్లీలో ఉన్న ఆయన పలువురు నేతల అపాయింట్ మెంట్లను కోరారు. ఇంకా ఎవరి నుంచీ కూడా పిలుపు రాలేదని సమాచారం. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలపై జాతీయ నేతలతో చర్చించాలన్నది జగన్ అభిమతం.

  • Loading...

More Telugu News