: ఉపాధ్యాయుడి వెకిలి చేష్టల ఎఫెక్ట్!... ప్రైవేట్ పాఠశాలపై స్థానికుల దాడి, రెండు బస్సులకు నిప్పు


భావి భారత పౌరులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురుతర బాధ్యతను మరిచి ఓ ఉపాధ్యాయుడు చేసిన వెకిలి చేష్టలు... అతడు పనిచేస్తున్న ప్రైవేట్ పాఠశాలకు లక్షలాది రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లిలో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఓ చిన్నారి బాలికపై ఆ పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాలిక ఫిర్యాదుతో ఆమె బంధువులు ఆగ్రహోదగ్రులయ్యారు. పాఠశాలపై మూకుమ్మడిగా దాడికి దిగారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. అంతటితో ఆగని వారు పాఠశాల ఆవరణలో నిలిపి ఉంచిన రెండు బస్సులకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో రెండు బస్సులు కూడా మంటల్లో తగలబడిపోయాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News