: కేంద్రానికి అంశాలవారీ మద్దతు...కేంద్ర కేబినెట్ లో చేరికపై కల్వకుంట్ల కవిత కామెంట్స్
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ లో చేరికపై టీఆర్ఎస్ ఎంపీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి క్రితం నోరు విప్పారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో డిల్లీకి చేరిన ఆమె అక్కడి మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూనే ఆసక్తికర అంశాలపై పార్టీ వైఖరిని వెల్లడించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి తాము అంశాల వారీగా మాత్రమే మద్దతు ఇస్తామని ఆమె ప్రకటించారు. అధికార పక్షానికి, విపక్షానికి సమాన దూరంలో ఉంటామన్నారు. ప్రజలకు మేలు జరిగే విషయాల్లో మోదీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందన్నారు. రైల్వే బడ్జెట్ లోనూ రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు. ఇక విభజన చట్టం హామీల అమలుపై స్వరం పెంచుతామని కూడా ఆమె పేర్కొన్నారు.