: భారత దర్శకుడు నమ్మించి వంచించాడని పాక్ నటి ఫిర్యాదు, అరెస్ట్!


తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెబుతూ, ఓ పాకిస్థానీ నటిని లొంగదీసుకుని ఆమె నుంచి లక్షల రూపాయలు స్వాహా చేసిన భోజ్ పురి దర్శకుడు శ్యయామ్ చరణ్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, మూడేళ్ల క్రితం పాక్ నటి (30)కి శ్యామ్ పరిచయం అయ్యాడు. ఆపై సినిమాల్లో అవకాశం ఇస్తానని చెబుతూ, ఆమెను లోబరచుకోవడమే కాకుండా, పలు దఫాలుగా రూ. 35.80 లక్షలు తీసుకున్నాడు. తనకు సినిమా చాన్స్ లు ఇప్పించకపోగా, తీసుకున్న డబ్బు కూడా తిరిగి చెల్లించక పోవడంతో ఆమె నిలదీసింది. దీంతో తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్న బబ్లూ, టైగర్ లతో కలసి శ్యామ్ ఆమెను బెదిరించాడు. దీంతో సదరు నటి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్ ను అరెస్ట్ చేశామని, మిగిలిన ఇద్దరు నిందితులూ పరారీలో ఉన్నారని ముంబై డీఎస్పీ బావ్చే వెల్లడించారు.

  • Loading...

More Telugu News