: 'వంగవీటి' కోసం విజయవాడ వెళ్తున్నా: రాంగోపాల్ వర్మ
తన ఆఖరి తెలుగు సినిమాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించుకున్న 'వంగవీటి' సినిమా కథపై పరిశోధన నిమిత్తం 26న విజయవాడ వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. సినిమా కోసం కొంత రీసెర్చ్ చేయాల్సి వుందని, ఆపై కొందరు వ్యక్తులను కలసి మాట్లాడతానని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఉదయం 8 గంటల సమయంలో విషయాన్ని వెల్లడించారు. కాగా, వర్మ విద్యాభ్యాసం విజయవాడలోనే జరిగిందన్న సంగతి తెలిసిందే. అప్పట్లో తనకు తెలిసిన అంశాలను ఈ చిత్రంలో జోడిస్తానని వర్మ ఇప్పటికే స్పష్టం చేశాడు.