: చంద్రబాబు నోట... డార్విన్ మాట!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నోట ప్రఖ్యాత జీవ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ సిద్ధాంతం వినిపించింది. విజయవాడలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో కీలకోపన్యాసం చేసిన చంద్రబాబు... డార్విన్ ఎవాల్యుయేషనరీ థియరీ నుంచి పుట్టిన ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ సిద్ధాంతం వినిపించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక లోటుతో సతమతమవుతున్నామని ఆయన చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం మనగలగాలంటే (సర్వైవ్) కావాలంటే... విపత్కర పరిస్థితులకు తట్టుకుని(ఫిట్టెస్ట్) నిబడాల్సిందేనని ఆయన సూత్రీకరించారు. ఇందుకోసం డబుల్ డిజిట్ గ్రోత్ ఒక్కటే మార్గమని చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆశించిన మేర కంటే మెరుగైన ప్రయాణమే సాగించామని చెప్పిన ఆయన, ఇకపైనా అదే దూకుడు కొనసాగించాలన్నారు. ఇప్పటిదాకా నమోదైన డబుల్ డిజిట్ గ్రోత్ ఇకపైనా నమోదైతేనే.. సర్వైవ్ కాగలమని ఆయన కలెక్టర్లకు ఉద్బోధించారు. చంద్రబాబు నోటి వెంట వినిపించిన ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ తరహా సిద్ధాంతాన్ని కలెక్టర్లు, ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆసక్తిగా విన్నారు.

  • Loading...

More Telugu News