: ఐవరీ కోస్ట్ లో భారత షిప్ హైజాక్
'జెన్ కో మెక్సికో' అనే పేరున్న భారత నౌక ఐవరీ కోస్ట్ సమీపంలో హైజాక్ కు గురైంది. మొత్తం 11 మంది నౌకలో విధుల నిర్వహణలో ఉండగా, వారిలో 10 మందిని విడిపించారు. నైజీరియా నౌకాదళం సహాయంతో నౌకలోని 10 మంది భారతీయులను విడుదల చేయించినట్టు విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. మరో ఉద్యోగి విడుదలకు హైజాకర్లతో చర్చిస్తున్నట్టు తెలిపారు. హైజాకర్ల డిమాండ్లు ఏమిటన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటనపై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.