: 'ఢిల్లీ! నీకో గుడ్ న్యూస్'...: కేజ్రీవాల్ ట్వీట్
ఢిల్లీలో ప్రజలు వాడుకునేందుకు చుక్కనీరు లేదని, తక్షణం కేంద్రం కల్పించుకోవాలని నేటి ఉదయం 7 గంటల సమయంలో ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆపై గంట వ్యవధిలోనే శుభవార్త చెప్పారు. తమ ఆందోళనలో భాగంగా, హర్యానా నుంచి ఢిల్లీకి నీటిని తెచ్చే కాలువను జాట్లు అడ్డుకోగా ఢిల్లీకి నీటి సరఫరా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కాలువను సైన్యం తమ అధీనంలోకి తీసుకుందని చెబుతూ, "ఢిల్లీకి శుభవార్త. మునాక్ కాలువ గేట్లు తెరచుకున్నాయి. ఢిల్లీకి నీరు ఎంత సేపట్లో చేరుతుందో, తిరిగి సరఫరా ఎప్పుడు మొదలవుతుందో తదుపరి వెల్లడిస్తా" అని ఆయన ట్వీట్ చేశారు. ఈ కాలువ గేట్లు తెరచుకోవడం ఢిల్లీకి 'గ్రేట్ రిలీఫ్' అని వ్యాఖ్యానించిన ఆయన, సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.