: కొన్నేళ్లపాటు ఉద్యోగం వదలకుండానే పాటలు రాశాను: రామజోగయ్య శాస్త్రి
కొన్నేళ్ల పాటు ఉద్యోగం చేస్తూనే పాటలు రాశానని... ఉద్యోగాన్ని పక్కనపెట్టి పాటలు రాయలేదని ప్రముఖ సినీ పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. తాను మొదట గాయకుడిని కావాలనుకున్నానని, అయితే, తానేంటో తనకు తెలియనప్పుడు ఆ విధంగా అనిపించిందని, తెలిశాక ఆ కోరికను వదిలేశానని చెప్పారు. మామూలుగా ఏడాదికి 70 పాటలు రాస్తానని, కొన్ని సందర్భాల్లో వంద నుంచి నూట యాభై వరకు కూడా రాశానని చెప్పారు. శివుడి పాట రాసినా...ఐటెమ్ పాట రాసినా పాట పాటేనని రామజోగయ్య శాస్త్రి అన్నారు.