: ఉగ్రవాదుల కాల్పుల్లో మరో ఆర్మీ కెప్టెన్ మృతి
శ్రీనగర్ సమీపంలోని పాంపోర్ లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పుల్లో మరో ఆర్మీ కెప్టెన్ తుషార్ మహాజన్ మృతి చెందాడు. కాగా, పాంపోర్ లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ రెండో రోజూ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 22 ఏళ్ల ఆర్మీ అధికారి పవన్ కుమార్ ను ఉగ్రవాదులు హతమార్చారు. ఇప్పటివరకు కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు చేరింది. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.