: జాట్ కులస్తులకు సెహ్వాగ్ వినతి
విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం హర్యానాలో జాట్ ల ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ఆందోళన వ్యక్తం చేశాడు. విధ్వంసకాండకు పాల్పడవద్దంటూ జాట్ లకు ఆయన విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశాడు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ రిజర్వేషన్ల అంశంపై పోరాడాలని సెహ్వాగ్ సూచించాడు. సెహ్వాగ్ జాట్ కులానికి చెందిన వ్యక్తి అన్న సంగతి చాలా మందికి తెలిసిందే. కాగా, హర్యానాలో రోహ్ తక్, భివానీ, జింద్, హిస్సార్ తదితర జిల్లాల్లో జాట్ ల ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం కర్ఫ్యూ కూడా విధించింది. శుక్రవారం రాత్రి రోహ్ తక్ లో హర్యానా ఆర్థిక మంత్రి ఇంటికి నిప్పు పెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రైళ్ల ను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.