: నన్ను ఇష్టపడేవారిని నా మేకప్ నిరాశపరిచింది: మలయాళ నటి నవ్యా నాయర్
ఇటీవల జరిగిన ఆసియా నెట్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమానికి ఓవర్ మేకప్ తో వచ్చిన మలయాళ నటి నవ్యా నాయర్ పై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు కురిపిస్తున్నారు. సాధారణ స్థాయి కన్నా కొంచెం ఎక్కువ మేకప్ తో ఆ అవార్డుల ఫంక్షన్ కు వెళ్లింది. ఓవర్ మేకప్ పై ఆమె అభిమానులు, నెటిజన్లు విమర్శించారు. అంతేకాకుండా, ఆమెకు పర్సనల్ గా కూడా ఈ విషయమై మెస్సేజ్ లు వచ్చాయిట. ఈ నేపథ్యంలో నవ్య తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. ‘నన్ను ఇష్టపడేవారికి నా మేకప్ నిరాశ పరిచి ఉండవచ్చు. పొరపాటే, నా ఓవర్ మేకప్ తో నిరాశపరిచినందుకు క్షమించమని అభిమానులను కోరుకుంటున్నాను’ అని నవ్యా తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొంది.