: గోదావరిలో పడవ బోల్తా: బాలుడు మృతి, పలువురు గల్లంతు
మహారాష్ట్ర నుంచి కాళేశ్వరానికి ప్రయాణికులతో వస్తున్న పడవ గోదావరిలో బోల్తా కొట్టింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కాళేశ్వరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్టుపల్లి వద్ద ఈరోజు జరిగింది. నదిపై నిర్మాణంలో ఉన్న అంతర్రాష్ట్ర వంతెన సమీపంలో జరిగిన ఈ సంఘటనలో 12 సంవత్సరాల బాలుడు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. నీట మునిగిన వారిలో 16 మందిని అక్కడి గంగపుత్రులు రక్షించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.