: ఉత్తమ జర్నలిస్టులకు అరుణ్ సాగర్ పేరిట అవార్డులు
ఉత్తమ జర్నలిస్టులకు ప్రముఖ పాత్రికేయుడు అరుణ్ సాగర్ పేరిట అవార్డులందజేస్తామని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. ఇటీవల మృతి చెందిన పాత్రికేయుడు అరుణ్ సాగర్ సంస్మరణ సభ ఈరోజు జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పాత్రికేయుడిగా అరుణ్ సాగర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్టు సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. కాగా, అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అరుణ్ సాగర్ పదిరోజుల క్రితం మృతి చెందారు. వామపక్ష ఉద్యమాలతో మమేకమై పెరిగిన ఆయన ఆపై జర్నలిజంలోకి అడుగుపెట్టారు.