: ప్రతిపక్షనేత హోదాను కోల్పోయిన విజయ్ కాంత్!


తమిళనాడులో డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ కు ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురు దెబ్బ తగిలింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖల్ని స్పీకర్ కు అందజేశారు. అందులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు డీఎండీకేకు చెందిన వారు. దీంతో తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్షనేత హోదాను విజయ్ కాంత్ కోల్పోయినట్లు స్పీకర్ ధన పాల్ ప్రకటించారు. కాగా, వచ్చే మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయమై విజయ్ కాంత్ తన నిర్ణయం ఇంతవరకూ ప్రకటించకపోవడంతో కూటమి ఏర్పాటులో జాప్యం జరుగుతోంది.

  • Loading...

More Telugu News