: కర్నాటక సీఎంపైకి పేపర్ బ్యాగ్ విసిరిన వ్యక్తి!


కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యపై ఒక వ్యక్తి పేపర్ బ్యాగ్ విసిరిన సంఘటన ఈరోజు బెంగళూరులో జరిగింది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో సిద్ధ రామయ్య ప్రసంగిస్తుండగా హఠాత్తుగా ఒక వ్యక్తి ఆయనపైకి పేపర్ బ్యాగ్ ను విసిరాడు. ఆయనకు కొద్ది దూరంలో ఆ బ్యాగ్ పడింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. ఆ బ్యాగ్ ను తెరిచి చూడగా అందులో కాగితంతో చుట్టిన ఒక పొట్లం ఉంది. అందులో చాక్లెట్లు ఉన్నాయి. ఈ ఘటనకు కారకుడైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News