: నిర్లక్ష్యం చేశాం... అనుభవిస్తున్నాం!: ఏపీలో కాంగ్రెస్ పరిస్థితిపై రఘువీరా నిర్వేదం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) చీఫ్ రఘువీరారెడ్డి నేటి ఉదయం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పార్టీ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశామని ఆయన ఒప్పుకున్నారు. దాని ఫలితాన్ని ప్రస్తుతం తామంతా అనుభవిస్తున్నామని కూడా వ్యాఖ్యానించారు. నేటి ఉదయం అనంతపురంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా రఘువీరారెడ్డి పూర్తిగా నిర్వేదంలో కూరుకుపోయినట్లు కనిపించారు. ‘‘రాష్ట్రంలో పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన మాట నూరు శాతం నిజం. ఆ ఫలితాలను మేము అనుభవిస్తున్న మాట కూడా అంతే వాస్తవం’’ అని రఘువీరా వ్యాఖ్యానించారు.