: 'ఫ్రీడం' స్మార్ట్ ఫోన్ సంస్థ నుంచి కీలక పత్రాల స్వాధీనం
ఫ్రీడం బ్రాండ్ పేరిట రూ.251కే స్మార్ట్ ఫోన్ అందిస్తామంటున్న రింగింగ్ బెల్స్ సంస్థ కార్యాలయంలో ఎక్సైజ్, ఐటీ విభాగాలు సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా కొన్ని కీలక పత్రాలను వారు స్వాధీనం చేసుకున్నారు. ఈవిషయమై రింగింగ్ బెల్స్ సంస్థ అధ్యక్షుడు అశోక్ చద్దా మాట్లాడుతూ, నోయిడాలోని తమ కార్యాలయానికి ఈ రెండు శాఖల అధికారులు నిన్న వచ్చారని, వారు కొన్ని మార్గదర్శకాలు సూచించారని ఆయన పేర్కొన్నారు. కాగా, అత్యంత చౌకగా లభించనున్న ఈ స్మార్ట్ ఫోన్ కోసం తొలి రోజున 3.7 కోట్లు, రెండో రోజున 2.47 కోట్ల మేరకు వినియోగదారులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.