: రాష్ట్రపతి భవన్, పార్లమెంటు, తాజ్ మహల్ లు... బానిసత్వానికి చిహ్నాలట!: ఆజం ఖాన్ సంచలన కామెంట్స్


సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆజం ఖాన్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి భవన్ తో పాటు పార్లమెంటు, తాజ్ మహల్ లను ఆయన బానిసత్వానికి చిహ్నాలుగా అభివర్ణించారు. బానిసత్వానికి గుర్తులుగా ఉన్న సదరు మూడు భవనాలను కూల్చివేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కు చెందిన రజా డిగ్రీ కళాశాలలో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ కోసం ఖర్చు చేస్తున్న ధనమంతా వృథానేనని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశంలో బానిసత్వానికి చిహ్నాలేమిటన్న విషయాన్ని పరిశీలిస్తే... ఆ జాబితాలో తాజ్ మహల్ ముందుంటుంది. ఆ తర్వాత బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నిర్మించిన రాష్ట్రపతి భవన్, పార్లమెంటు భవనాలే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News