: ఆ పత్రిక ప్రజల ఆస్తి... త్వరలోనే స్వాధీనం చేసుకుంటాం: 'సాక్షి' పత్రికపై చంద్రబాబు సంచలన ప్రకటన


వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన ‘సాక్షి’ దినపత్రికపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షి పత్రిక పేరును నేరుగా ప్రస్తావించకుండానే ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నిన్నటి మీడియా సమావేశంలో పలు అంశాలపై సవివరంగా మాట్లాడిన చంద్రబాబు... పార్టీలోకి చేరికలు, అవినీతి తదితరాలను ప్రస్తావించారు. ‘‘అవినీతిపరుల ఆస్తులను త్వరలో స్వాధీనం చేసుకుంటాం. జప్తులో ఉన్న అవినీతి పత్రికనూ స్వాధీనం చేసుకుంటాం. అది ప్రభుత్వ ఆస్తి, ప్రజలకు చెందుతుంది’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు... సత్యం ఆస్తులు జప్తు చేశాక ఎవరికి వెళ్లాయి? అని మీడియా ప్రతినిధులకు ఎదురు ప్రశ్నలు సంధించారు. ‘‘అవినీతిపరుల ఆస్తులను తీసుకుంటాం. నా కోసం కాదు. ప్రజల కోసం. ఈ విషయాన్ని మా ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టాం. ప్రత్యేక కోర్టునూ ఏర్పాటు చేశాం’’ అని కూడా చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News