: ముషారఫ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పై ఇస్లామాబాద్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2007లో మిలటరీ చర్యల్లో భాగంగా అబ్దుల్ రషీద్ ఘాజీ హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ హత్యపై 55 సార్లు కేసు విచారణకు రాగా, ముషారఫ్ ఒక్కసారి కూడా హాజరుకాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం, ముషారఫ్ పై నాలుగోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా, ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, తనను నిర్దోషిగా ప్రకటించాలని ముషారఫ్ పెట్టుకున్న పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. కాగా, రెండు రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ముషారఫ్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.