: పఠాన్ కోట్ కు రానున్న పాకిస్థాన్ దర్యాప్తు బృందం


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి ఘటనలో జైషే మొహమ్మద్ పాత్రపై సాక్ష్యాధారాల సేకరణకు పాకిస్థాన్ కు చెందిన దర్యాప్తు బృందం భారత్ కు రానున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో పాక్ దర్యాప్తు బృందం భారత పర్యటనకు రావచ్చని ఉన్నత స్థాయి దౌత్యాధికారి పాకిస్థాన్ కు చెందిన డాన్ పత్రికకు తెలిపారు. ఇస్లామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ఈ పర్యటన తేదీలు ఖరారు కావాల్సి ఉందని అన్నారు. ఈ ఘటనపై భారత్ ఇప్పటికే పలు సాక్ష్యాధారాలు అందజేయడంతో నవాజ్ షరీఫ్ దర్యాప్తు బృందాన్ని నియమించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News