: శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై కాల్పులు


శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అక్కడి ప్యాంపోర్ సమీపంలో సీఆర్ పీఎఫ్ వాహనంపై ఈ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు సీఆర్ పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. మరోవైపు బుడగమ్ జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది ఇష్ఫక్ అహ్మద్ వనీ అలియాస్ మోల్వీని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని పెత్ మఖమా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో ఇష్ఫక్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఏకే అసాల్ట్ రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News