: లక్ష మరుగుదొడ్లు నిర్మించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించాం: స్పీకర్ కోడెల


ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సమక్షంలో ఈ రోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఏపీకి సహకారం ఇచ్చేందుకు జపాన్ బృందం ముందుకొచ్చిందని, వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీవో) నాలెడ్జ్ పార్టనర్ గా వ్యవహరిస్తుందని కోడెల తెలిపారు. తక్కువ ధరకే సాంకేతికతను స్వచ్ఛాంధ్రకు డబ్ల్యూటీవో బదలాయిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టామని, పట్టణ ప్రాంతంలో గ్రూప్ మరుగుదొడ్ల నిర్మాణానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. మోదీ స్వచ్ఛ భారత్ లో భాగంగా బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని కోడెల పేర్కొన్నారు. అలా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజక వర్గంలో లక్ష మరుగుదొడ్లు నిర్మించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News