: ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డిని పరామర్శించిన మంత్రి తుమ్మల
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డిని పరామర్శించారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న రాంరెడ్డి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాంతో హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఆసుపత్రికి వెళ్లిన తుమ్మల ఆయన కటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రాంరెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.