: చంద్రబాబు తలచుకోవట్లేదుగానీ, తలచుకుంటే వైకాపా ఖాళీ: చినరాజప్ప


తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు తలచుకుంటే వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. జగన్ వైఖరితో వైకాపా నేతల్లో అసంతృప్తి అధికమైందని, ఆ కారణంతోనే పలువురు టీడీపీలో చేరాలని భావిస్తున్నారని అన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించిన ఆయన, అభివృద్ధిని కోరుకునే వారు ఎవరు పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తామని, అంతమాత్రాన పార్టీలను మార్చే సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నట్టు కాదని అన్నారు. చంద్రబాబు నోటి నుంచి 'ఓకే' అనే ఒక్క మాట వస్తే, వైకాపాలో ఎవరూ మిగలరని మంత్రి జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News