: పాలమూరు ఎత్తిపోతలపై కాంగ్రెస్, వైసీపీలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయి?: ఎంపీ జితేందర్ రెడ్డి
పాలమూరు ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్, వైసీపీలు గవర్నర్ కు ఫిర్యాదు చేయడంపై టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీలు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. మహబూబ్ నగర్ లో విలేకరులతో మాట్లాడుతూ, ఈ పథకంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నర్ కు లేఖ రాయడం ఎంతవరకు సబబని అడిగారు. అసలు టెండర్లు కూడా పిలవకుండానే అక్రమాలు జరిగాయంటూ ఎలా ఫిర్యాదు చేస్తారని జితేందర్ నిలదీశారు. వైఎస్ హయాంలో ప్రాజెక్టుల టెండర్లలోనే అక్రమాలు జరిగాయని, మొబలైజేషన్, అడ్వాన్స్ ల పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేబట్టిన మిషన్ భగీరథలో టెండర్లన్నీ తక్కువకే వేశారన్నారు.