: రోహిత్ వేముల ఆత్మహత్యపై ద్విసభ్య కమిటీ నివేదిక.... స్మృతి, దత్తాత్రేయలకు క్లీన్ చిట్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యపై విచారణ చేసిన ద్విసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. ఇందులో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర సహాయ మంత్రి బండారు దత్తాత్రేయలకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఘటనలో వారి ప్రమేయం లేదని తెలిపింది. అయితే సెంట్రల్ వర్సిటీ యాజమాన్యానిదే తప్పంటూ కమిటీ నివేదిక సమర్పించింది.