: రాజధాని మాస్టర్ ప్లాన్ పై విజయవాడలో అవగాహన కార్యక్రమం
సీఆర్ డీఏ రాజధాని మాస్టర్ ప్లాన్ పై విజయవాడ ఉపకలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు ప్రజాప్రతినిధులకు అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. సీఆర్ డీఏ పరిధిలోని 56 మండలాలకు సంబంధించిన ముసాయిదా ప్రణాళిక-2015పై ఈ సమావేశం జరిగింది. ముసాయిదా ప్రణాళికలో గ్రీన్ జోన్ అంశంపై సందేహాలు తీర్చాలని, రైతు సమస్యలను అధికారులు సానుకూలంగా పరిశీలించాలని సదస్సుకు హాజరైన ఎమ్మెల్యేలు కోరారు. అంతేగాక జోనల్ డెవలప్ మెంట్ ప్రణాళికపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సీఆర్ డీఏ అధికారులకు తెలిపారు. కృష్ణా జిల్లా టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీ, బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు.