: 'ఫ్రీడం 251'కు ఐదు కోట్ల రిజిస్ట్రేషన్లు: రింగింగ్ బెల్స్ ప్రకటన


అతి తక్కువ రేటుకి స్మార్ట్ ఫోన్ ని ఆఫర్ చేసి, మొబైల్ రంగంలో సంచలనం రేపిన 'ఫ్రీడం 251' స్మార్ట్ ఫోన్ రిజిస్ట్రేషన్లలో కూడా సంచలనం సృష్టించింది. ఆన్ లైన్ ముందస్తు బుకింగ్ లో ఈ ఫోన్ కు రెండు రోజుల్లోనే ఐదు కోట్ల రిజిస్ట్రేషన్లు వచ్చాయని 'రింగింగ్ బెల్స్' కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ముందుగా 25 లక్షల ఫోన్లను మాత్రమే అందించాలని కంపెనీ నిర్ణయించిందని, ఈ నేపథ్యంలో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇంకా కొనసాగించాలా? వద్దా? అనే విషయాన్ని పునరాలోచిస్తున్నామని రింగింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ అశోక్ చద్దా పేర్కొన్నారు. ఈ నెల 21 రాత్రి 8 గంటల వరకే ముందస్తు బుకింగ్ ను ఉంచాలని మొదట కంపెనీ నిర్ణయించిందన్నారు.

  • Loading...

More Telugu News